భీష్మను బాలీవుడ్‌లో తెరకెక్కించే ప్రయత్నం
బాలీవుడ్ వారి కళ్లన్నీతెలుగు సినిమాల మీదే ఉన్నట్టున్నాయి. అందుకే ఒకదాని తర్వాత ఒకటిగా మన సినిమాలు పట్టుకెళ్లి తమ భాషలోకి రీమేక్ చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ జెర్సీ, ఆర్‌ఎక్స్ 100 రెడీ అవుతున్నాయి. ఓ బేబీ, డియర్ కామ్రేడ్ కూడా రీమేక్ కానున్నాయి. ఇప్పుడు ‘భీష్మ’ని కూడా పట్టుకుపోయినట్టు తెలుస్తోంది. వరుస పరాజయాలతో విసిగిపోయిన నితిన్‌కి ఊరటనిచ్చింది ‘భీష్మ’. సింపుల్ స్టోరీతో, చక్కని కామెడీతో ఎంటర్‌టైన్ చేసి కాసులు మూటగట్టింది. దాంతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తాడట. నిజానికి రణబీర్ కెరీర్ కూడా నత్తనడకన సాగుతోంది. భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు కానీ అవి ఎప్పుడు రిలీజవుతాయో తెలియదు. అతన్ని తెరమీద చూసి చాలాకాలం కావడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అందుకే అతడొక మంచి ఎంటర్‌టైనర్ చేయడం అవసరమని భావించిన ఓ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని, రణబీర్ కూడా ఓకే అన్నాడని సమాచారం. అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
For More News..