తమిళ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగుతోంది నయనతార. కానీ, ఈ స్టేటస్ ఆమెకు అంత తేలికగా రాలేదు. కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను, ఛీత్కారాలను నయన్ ఎదుర్కొంది. తాజాగా తమిళ దర్శకుడు పార్థిపన్ ఈ హీరోయిన్‌తో తన తొలి సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు. ‘నయన తార ఫొటోలు చూసి నేను తీస్తున్న మళై అనే సినిమా కోసం ఆమెకు ఫోన్ చేసి రమ్మన్నాను. ఆరోజు రాకుండా మరుసటి రోజు ఫోన్ చేసింది. నిన్న రాలేకపోయాను బస్సు ఎక్కి రేపు ఉదయంకల్లా వస్తాను అని చెప్పింది. నాకొచ్చిన కోపానికి నువ్వింక రావద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
ఆరోజు కేరళ నుంచి బస్సులో వస్తానన్న అమ్మాయి ఇప్పుడు తమిళ స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఎంతో గొప్ప విషయం’ అంటూ తెలిపాడు. ఈ అవకాశం మిస్సైనా ‘అయ్యా’ అనే సినిమాతో నయన్ కోలీవుడ్‌కి పరిచయమైంది. తర్వాత రజనీకాంత్‌తో చంద్రముఖిలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.