
- రాయదుర్గంలో అదుపులోకి తీసుకుని రాయచోటికి తరలింపు
గచ్చిబౌలి, వెలుగు: నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్ మెంట్ లోని ఉంటున్న పోసానిని.. బుధవారం రాత్రి ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ లపై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణ, పశ్చిమగోదావరి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.