
నటుడు పోసాని కృష్ణ మురళి జైలులో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.. గతంలో పోసాని చేసిన వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ.. ఏపీలో పలు చోట్ల కేసులు నమోదైన క్రమంలో అన్నమయ్య జిల్లా పోలీసులు బుధవారం ( ఫిబ్రవరి 26 ) రాత్రి హైదరాబాద్ లో పోసానిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. ఇదిలా ఉండగా.. శనివారం ( మార్చి 1, 2025 ) పోసాని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
అస్వస్థతకు గురైన పోసానిని జైలు అధికారులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అక్కడ పోసానికి పలు రకాల టెస్టులు నిర్వహించిన డాక్టర్లు ఆయనను కడప రిమ్స్ కు తరలించినట్లు సమాచారం. పోసాని గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలున్నట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించినట్లు సమాచారం.
బుధవారం ( ఫిబ్రవరి 26) పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ( ఫిబ్రవరి 27 ) రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచగా... పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అనంతరంపోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. మార్చి 12 వరకు రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు పోసాని కృష్ణ మురళి.