
అభ్యంతరకర వ్యాఖ్యలతో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి ఇవాళ (మార్చి 22) విడుదలయ్యారు. అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో ఫిబ్రవరి 26న అరెస్టయిన పోసాని.. అప్పటి నుంచి రిమాండులో ఉన్నారు. పోసాని విడుదల సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున జైలు దగ్గరికి వెళ్లారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పోసానిని కలిశారు.
ALSO READ | డీలిమిటేషన్పై ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ..
ఫిబ్రవరి 26న అరెస్టైన పోసానికి బెయిల్ వచ్చినట్లే వచ్చి మళ్లీ రిమాండ్ లోనే గడపాల్సి వచ్చింది. వివిధ స్టేషన్లలో నమోదైన కేసులతో బెయిల్ వచ్చినా మళ్లీ రిమాండ్ కు తరలిస్తూ వచ్చారు పోలీసులు. పోసానికి బెయిల్ వచ్చినా సీఐడీ పీటీ వారెంట్ తో జైలులోనే అరెస్ట్ చేసి చేసిన కోర్టు.. నెల రోజులుగా నటుడు పోసాని కృష్ణ మురళి నరసారావు జైల్లో రిమాండులో ఉన్నారు. దీంతో తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు.
శుక్రవారం (మార్చి 21) గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. . దీంతో శనివారం (మార్చి 22) బెయిల్ పై విడుదల అయ్యారు.