
టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్.. ఈ బాహుబలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా.. రెండు రోజులుగా ఇదే రచ్చ రచ్చ నడుస్తుంది. ప్రభాస్ పెళ్లి అంటూ కొన్నేళ్లుగా.. తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి.. ఇవి కామన్ కూడా.. ఈసారి మాత్రం జాతీయ మీడియా నుంచి ఈ వార్తలు రావటం కొంచెం డిఫరెంట్. జాతీయ మీడియాలో ప్రభాస్ పెళ్లి వార్తలు జోరుగా రావటంతో.. ఈసారి కన్ఫామ్ అనే క్లారిటీ తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ గా డిస్కషన్ నడుస్తుంది.
హైదరాబాద్ సిటీలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త.. బాగా డబ్బున్న బిజినెస్ మెన్ కుమార్తెతో త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరగబోతుందంట. పెళ్లి ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలయ్యాయనేది ఆ కథనాల సారాంశం. ప్రభాస్ పెళ్లి ఏర్పాట్లను.. పెదనాన్న కృష్ణంరాజు భార్య స్వయంగా దగ్గరుండి చూస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ పెళ్లికి ఎంతో టైం లేదని.. ఏప్రిల్, మే నెలల్లోనే ఉండొచ్చని నేషనల్ మీడియాలో వస్తున్న సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, ఫౌజి మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలతోపాటు సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా ఉగాదికి ప్రారంభం కాబోతున్నది. చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.. రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లోనే ప్రభాస్ పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సమ్మర్ లోనే ప్రభాస్ పెళ్లి ఖాయమని.. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదని కుటుంబ సభ్యులు అందరూ గట్టిగా చెప్పటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ వయస్సు 45 ఏళ్లు.. పెళ్లిని ఇంకా వాయిదా వేయటం అనేది మంచిది కాదని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయటంతో ఓకే చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు.
అందుకు తగ్గట్టుగానే కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి సైతం ఈ మధ్య కాలంలో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు కూడా సమాచారం. ప్రభాస్ పెళ్లి వార్తలు తరచూ వస్తూనే ఉంటాయి.. ఈసారి మాత్రం కొంచెం గట్టిగానే.. అందులోనూ జాతీయ మీడియా నుంచే రావటం ఆలోచించాల్సి అంశమే మరి..