Prabhu Ganesan: ప్రముఖ స్టార్ హీరోకి బ్రెయిన్‌ సర్జరీ.. అసలేం జరిగిందంటే?

Prabhu Ganesan: ప్రముఖ స్టార్ హీరోకి బ్రెయిన్‌ సర్జరీ.. అసలేం జరిగిందంటే?

సీనియర్ నటుడు ప్రభు గణేశన్కు (Prabhu Ganesan) బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మెదడు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో బ్రెయిన్ అనూరిజం సర్జరీ చేయించుకున్నాడు.

జ్వరం మరియు తలనొప్పి లక్షణాలతో ప్రభు కొన్ని రోజుల క్రితం మెడ్వే హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అయితే మెదడులోని మధ్య  మెదడులోని రక్తనాళంలో (మస్తిష్క ధమని భాగంలో) వాపు ఉన్నట్లు వైద్యులు  గర్తించారు. దీంతో చిన్నపాటి సర్జరీ చేశారు. ప్రస్తుతం నటుడు ప్రభు ఇంట్లో కోలుకుంటున్నారు. అంతా క్షేమంగా ఉన్నట్లు తన నటుడి PRO చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

ప్రభు సినిమాల విషయానికి వస్తే:

ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది లెజెండరీ నటుడు శివాజీ గణేశన్‌ తనయుడే ప్రభు. అతను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 220 కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. 1980లు మరియు 90వ దశకంలో తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుల్లో ప్రభు ఒకరు.

Also Read : గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు తరహాలో చిరు అనిల్ రావిపూడి సినిమా

ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అజిత్ హీరోగా వస్తోన్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమా (Good Bad Ugly) చేస్తున్నాడు.ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఇకపోతే నటుడు ప్రభు చంద్రముఖి, డార్లింగ్‌, ఆరెంజ్‌, దరువు, దేనికైనా రెడీ, పొన్నియన్‌ సెల్వన్‌, వారసుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.