మోడీ ఓ దుర్మార్గుడు : ప్రకాశ్ రాజ్‌

మోడీ ఓ దుర్మార్గుడు : ప్రకాశ్ రాజ్‌

ఆల్టర్నేట్ పాలిటిక్స్ కు మంచి రోజులు..స్థానికుడికే స్థానిక సమస్యలు తెలుస్తాయి: ప్రకాశ్ రాజ్‌

హైదరాబాద్ , వెలుగు: ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నారని సినీ నటుడు, బెంగళూరు సెంట్రల్ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రకాశ్ రాజ్ అన్నారు. స్థానికుడికే స్థానిక సమస్యలు తెలుస్తాయని, సమస్యలు తెలిసినవాడ్నే నాయకుడిగా ఎన్నుకోవాలని సూచించారు. సోమవారం ప్రకాశ్ రాజ్ ‘వీ 6–వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

వీ6-వెలుగు : నమస్తే ప్రకాశ్ రాజ్ గారు.

బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు కదా. అక్కడ స్పందన ఎలా ఉంది?

ప్ర కాశ్ రాజ్: మంచి స్పందన లభిస్తున్నదండీ.

మీరు నమ్మండీ నమ్మకపోండి.. కానీ ఇది నిజం. నన్ను నటుడిగా కాదు.. జనం సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆదరిస్తున్నారు.

ఎన్నికలు ఎలా ఉన్నాయి?

ప్రతి ఎన్నికల్లో క్యాస్ట్, రిలీజియన్ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వే కులం, నీదే మతం.. ఆ ప్రాంతంలో ఏ కులం వాళ్లు ఎక్కువగా ఉన్నారు.. ఏ మతం వాళ్లు ఎక్కువగా ఉన్నారు.. ఏ కులం వాళ్లను అభ్యర్గాథి నిలబెడదాం .. ఏ మతం వాళను్ల అభ్యర్థిగా నిలబెడదాం .. ఎప్పుడు వీటి గురించే పార్టీలు ఆలోచిస్తున్నాయి. ప్రజల సమస్యల గురించి మాట్లాడటం లేదు. నీళ్ల గురించి మాట్లాడటం లేదు. దేశం గురించి మాట్లాడటం లేదు. బెంగళూరులో భూమికి విలువ పెరిగింది కానీ.. మనుషులకు విలువ పెరిగిందా? దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా?! స్థానిక సమస్యలు తెలిసినవాడు, స్థానికుడు నాయకుడు కావాలి. అలాంటివాళ్లను ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి.

మైనార్టీ ఓట్లకోసమే మీరు బెంగళూరు సెంట్రల్

ఎంచుకున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారు కదా..!

ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు. మోడీ ఎవరండి? ఆయన ఒక ఎంపీ .. ఆయన ఓ దుర్మార్గుడు. ఆయన అబద్ధాలు చెప్తాడు. ఒక దుర్మార్గుడి నోటి నుంచి మరో దుర్మార్గుడ్ని నాయకుడిగా ఎన్నుకోవాలా? మోడీ 18గంటలు పనిచేస్తారని చెప్పుకొని నాయకులు గెలువాలా? అలా గెలిచే నాయకులు ఏం చేస్తారు? పోటీ చేస్తున్న అభ్యర్థి తాను ఏం చేస్తున్నాడో చెప్పాలి. గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలి. రాహుల్ గాంధీ ఎవడండి?! మా దగ్గర ఆయన నిల్చున్నాడా? ఆయనకు మా సెగ్మెంట్ తో సంబంధం ఉందా? వాళ్లొచ్చి ఇక్కడ పాలించరు కదా. ఇండియా అంటే రాహుల్ , మోడీనేనా..? మీరు ఎంపీగా గెలిస్తే కాంగ్రెస్ వైపా, బీజేపీవైపా?

నేను ఏ పార్టీకీ చెం దినవాడిని కాదు. రేపు కేంద్రంలో ఎవరు గెలుస్తారో గెలువని చూద్దాం. మా ప్రజల సమస్యలు తీరుస్తా రా.. మా ప్రజలకు ఉద్యోగాలు ఇస్తారా.. వాళ్ల మేనిఫెస్టో ఏంది చూద్దాం. ఏ ఒక్క పార్టీ కోసమో నా ప్రజల ఓట్లను ఇచ్చుకోను. ప్రజల పక్షాన ఉంటాను.

బెంగళూరు లో కనిపిస్తున్న సమస్యలేమిటి?

బెంగళూరు అంటే బ్రిగేడ్ రోడ్లు, ఐటీ మాత్రమే కాదు. బెంగళూరులో రెండువేల స్లమ్స్ ఉన్నాయి. పబ్లిక్ హెల్త్​ సరిగ్గా లేదు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. 250 చెరువులు ఉన్నా.. వాటిని ఉపయోగించుకోవడంలేదు. బెంగళూరును బాగుచేయాలన్న దూరదృష్టి నాయకులకు లేదు. బీజేపీ ఎంపీ పదేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినా.. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కరెక్ట్​ వ్యక్తిని ఎన్నుకోకపోవడం వల్లే ఇన్ని సమస్యలు.

రాజకీయాల్లోకి సినిమా యాక్టర్లు వస్తారు..పోతారనే ప్రత్యర్థుల విమర్శలపై ఏమంటారు?

వాళ్లు అలా అంటే.. నేను ప్రజలకు చెప్పేదొక్కటే. ఇన్నాళ్లూ మీ వద్దకు దొంగలు, దొంగ నాయకులు వచ్చారు.. ఇక్కడే ఉన్నారు. ఆ దొంగలను, ఆ దొంగ నాయకులను పంపించేయండి. నేను నటుడ్ని అని చెప్పుకోవడానికి, కళాకారుడిని

అని చెప్పుకోవటానికి సిగ్గుపడను. దొంగలమని చెప్పుకోవడానికి ఆ నాయకులకు సిగ్గులేదు కదా. రాజకీయాల్లోకి యాక్టర్లు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, పౌరులు వస్తారు. రావాలి కూడా. మోడీని తిడితే నన్ను యాంటీ నేషనల్ అంటారు. భిన్నాభిప్రాయాలు ఉంటే అలా ముద్ర వేయడమేనా?.

ఎవరు ప్రధానవుతారని అనుకుంటు న్నారు?

దేశంలో ఆల్టర్నే ట్ పాలిటిక్స్​కు మంచి రోజులు వచ్చాయి. ఆ వైపు అందరూ ఆలోచిస్తున్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకోరు.. ప్రధానమంత్రిని ఎన్నుకోరు. ప్రజలు ఎన్నుకునేది తన ప్రాంతంలోని ఎమ్మెల్యేను, ఎంపీని. మంచి అభ్యర్థిని ఎంపీగా ఎన్నుకుంటే.. వాళ్లు మంచి ప్రధానిని ఎన్నుకుంటారు. దేశానికి మంచి ప్రధాని కావాలంటే.. ముందు మంచి అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలి.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వర్కవుట్ అవుతుందా?

నాకు నచ్చిన నాయకుడు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ గెలుస్తుందా ఓడుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న కాదు. కేసీఆర్ ఓ మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పోరాటం చేస్తున్నారు. ఆయన ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. జాతీయ సబ్జెక్టులు, రాష్ట్ర సబ్జెక్టుల గురించి చెప్తున్నారు. రాష్ట్రం చూసుకోవాల్సిన పనులను సెంట్రల్ ఎందుకు చూస్తోందని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఆ ఫ్రంట్ గెలుస్తుందా.. లేదా అని ఆలోచించే బదులు దాని లక్ష్యం గురించి మనందరం ఆలోచించాలి.