Prithiveeraj: ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను.. సందీప్‌ రెడ్డి వంగా 'యానిమల్తో' నా లైఫ్ మారిపోయింది

Prithiveeraj: ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను.. సందీప్‌ రెడ్డి వంగా 'యానిమల్తో' నా లైఫ్ మారిపోయింది

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమా టీజర్ మార్చి 17న రిలీజ్ చేశారు. టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో టీజర్ లాంచ్ ఈవెంట్లో మేకర్స్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు పృథ్వీరాజ్ (Prithiveeraj) మాట్లాడిన స్పీచ్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. 

పృథ్వీరాజ్ మాట్లాడటటం మొదలు పెడుతుండగానే.. ఫ్యాన్స్ కేరింతలతో యానిమల్ అంటూ కిక్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకి థ్యాంక్స్ చెబుతూ స్పీచ్  స్టార్ట్ చేశారు.

'గ‌త 50 సంవ‌త్సరాలుగా నేను ఇండ‌స్ట్రీలో ఉన్నాను. ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను. సక్సెస్, ఫెయిల్యూర్స్ చూసాను. కానీ, ఇప్పుడు యానిమల్ మూవీ తర్వాత నా లైఫ్ మారింది. ఇప్పటివరకు నా కెరీర్లో 250 నుంచి 300 వ‌ర‌కు సినిమాలు చేశాను. కానీ, అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో అత్యంత క‌ష్టమైన పాత్ర చేశానని చెప్పుకొచ్చాడు. అలాగే, ఇందుకు గాను నేను డైరెక్టర్ సందీప్‌ రెడ్డికి గాను ఎప్పటికి రుణపడి ఉంటానని' పృథ్వీరాజ్ అన్నారు. ఇక టీజర్లో పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ ఒకటి ఆసక్తి కలిగిస్తోంది. ఈ  సిటీలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఉందా, చచ్చిపోయిందా అంటూ ఆసక్తిపెంచాడు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికి వస్తే.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్‌గా 'వైజయంతీ ఐపీయస్' పాత్రలో కనిపించనుంది. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, ఎమోషన్స్, వైరం, సెంటిమెంట్ నేపథ్యంలో 'అర్జున్‌ S/O వైజయంతి' సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్, విజయశాంతి డైలాగ్స్ పవర్ ఫుల్గా ఉన్నాయి.  ఈ మూవీ సమ్మర్ కానుకగా విడుదల కానుంది.