![ఫోన్లు, మెసేజ్లతో వేధిస్తున్నారు: YCP ఫ్యాన్స్ దెబ్బకు సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన పృథ్వీ](https://static.v6velugu.com/uploads/2025/02/actor-prithvi-files-complaint-with-cybercrime-police-against-ycp-fans_V71PauMDGj.jpg)
హైదరాబాద్: సినీ నటుడు పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ శ్రేణులు గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్, మెసేజ్స్ పెడుతూ వేధిస్తున్నారని కుటుంబ సమేతంగా వెళ్లి పృథ్వీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో, ఫోన్లు, మేసేజులతో అసభ్యంగా దూషిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
యంగ్ హీరో విశ్వక్ సేన హీరోగా తెరకెక్కిన చిత్రం లైలా. ఈ మూవీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ యాక్ట్ చేశారు. 2025, ఫిబ్రవరి 14న విడుదల లైలా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా మూవీ యానిట్ ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో పృథ్వీ ‘11 మేకలు, 150 మేకలు’’ అంటూ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. పరోక్షంగా వైసీపీని ఉద్దేశించే పృథ్వీ ఈ కామెంట్స్ చేశాడని.. ఆ పార్టీ అభిమానులు భగ్గుమన్నారు.
ALSO READ | తగ్గేదేలా అంటూ బూతులు తిట్టిన కమెడియన్ పృధ్వీ.. మిడిల్ ఫింగర్ ఫొటోతో హీరో విశ్వక్ సేన్..
సోషల్ మీడియాలో పృథ్వీని టార్గెట్గా చేసుకుని వైసీపీ అభిమానులు రెచ్చిపోయారు. పృథ్వీ వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూనే.. బై కాట్ లైలా మూవీ అంటూ పిలుపునిచ్చారు. జగన్, వైసీపీ ఫ్యాన్స్ దెబ్బకు బైకాట్ లైలా మూవీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంత జరిగినా పృథ్వీ మాత్రం వెనక్కి తగ్గకుండా సారీ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో వైసీపీ అభిమానులు మరింత రెచ్చిపోవడంతో తట్టుకోలేక చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు పృథ్వీ.