![Actor Prudhvi Raj: ఆస్పత్రిలో చేరిన కమెడియన్ పృధ్వీ : హైబీపీకి ట్రీట్మెంట్](https://static.v6velugu.com/uploads/2025/02/actor-prithviraj-admitted-to-hospital-with-high-bp_NUb2j5e96q.jpg)
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. కమెడియన్ పృధ్వీ ఆస్పత్రిలో చేరారు. హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హై బీపీతో బాధపడుతున్నట్లు పృధ్వీ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి హై బీపీ రావడంతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. ‘లైలా’ సినిమా ఈవెంట్ సమయంలో వైసీపీకి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లో నిలిచిన పృథ్వీ..#PrudhviRaj #Laila #LailaTrailer #VishwakSen pic.twitter.com/xcT3g5HZkj
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) February 11, 2025
రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి 9న) లైలా మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 150 మేకలు.. 11 మేకల కథ చెప్పారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి.. జగన్ ను దెప్పిపొడుస్తూ చేసిన ఈ వ్యాఖ్యలతో.. పొలిటికల్ వార్ నడుస్తుంది. పృధ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో సారీ చెప్పినా.. పృధ్వీనే క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ.. ఎక్స్ వేదికగా #BoycotLaila పేరుతో టార్గెట్ చేసింది.
ఈ క్రమంలోనే 2025, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం పృధ్వీ ఓ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీకి.. జగన్ కు క్షమాపణలు చెప్పేది లేదని తెగేసి చెప్పాడు.. అప్పటి నుంచి వైసీపీ నుంచి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ మరింత పెరిగింది. ఇదే సమయంలో లైలా మూవీ యూనిట్ నుంచి కూడా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తుంది.
ఈ పరిణామాల క్రమంలో.. హఠాత్తుగా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు కమెడియన్ పృధ్వీ.హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పృథ్విరాజ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
పృథ్వీ చేసిన కామెంట్స్ తో ‘‘బైకాట్ లైలా మూవీ’’ రెండ్రోజులు గడిచిన కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మరో మూడు రోజుల్లో (ఫిబ్రవరి 14న) సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో లైలా మూవీకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆందోళనలో చిత్ర బృందం ఉంది. ఏమవుతుందో చూడాలి.