![BoycottLaila: సారీ చెప్పేదే లేదు.. దమ్ముంటే లైలా మూవీని ఆపుకోండి : వైసీపీకి పృథ్వీ రివేంజ్ సవాల్](https://static.v6velugu.com/uploads/2025/02/actor-prithviraj-audio-goes-viral-over-remarks-made-against-ysrcp-party_FRJynMcbDq.jpg)
లైలా ఈవెంట్‌లో కమెడియన్ పృథ్వీ రాజ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ఎలాంటి సంచలనం రేపాయో తెలిసిందే. ఇప్పటికీ ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హీరో విశ్వక్ సేన్ మీడియా ముందుకొచ్చి సారీ చెప్పిన వైసీపీ పార్టీ శ్రేణులు ఊరుకునే ప్రసక్తే లేదనే విధంగా సోషల్ మీడియా వేడి వాతావరణంలో కొనసాగుతోంది.
లేటెస్ట్గా నటుడు, కమెడియన్ పృథ్వీ రాజ్ మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. "ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. వైసీపీ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎప్పుడు మాట్లాడలే. సినిమా ఫంక్షన్స్లో అలా వారిపై మాట్లాడిన అవసరం లేదు. ఎక్కడా వారి పేర్లు కూడా ప్రస్తావించలేదు.
సినిమాని సినిమాగా చూడాలి. రాజకీయం రాజకీయంగా చూడాలి. ఇక దాన్ని తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. ఇదేదో మత సామరస్యం, ఏదో సినిమాని నిషేదించాలని అంటున్నారు. సినిమా చూడొద్దు అంటే, ఎవరైనా చూడకుండా ఉంటారా.. ? సినిమా సూపర్ హిట్ అవుతుంది చూసుకోండి" అని పృథ్వీ రాజ్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతుంది. అయితే, ఇందులో పృథ్వీ రాజ్ ఎక్కడ కూడా సారీ చెప్పకపోవడంతో ఈ రచ్చ మరింత రాజుకుంది.
పృథ్వి ఆడియో విడుదల :
— Anitha Reddy (@Anithareddyatp) February 11, 2025
ఆ పృద్వి గాడికి ఇంకా కొవ్వు తగ్గలేదు నిన్న హీరో సారీ చెప్పితే... ఈరోజు కొవ్వు పొగరుతో ఆ వెదవ పృద్వి గాడు మాత్రం తాను మాట్లాడింది కరెక్ట్ అంటూ ఆడియో విడుదల pic.twitter.com/BP6i86QCjk
ఇది జస్ట్ టీజర్ మాత్రమే.. మేము మారము. మా నాయకుడి గురించి ఇలాగే మాట్లాడతాం అంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి ఈ రచ్చకు కారణమైన పృథ్వీ రాజ్ స్పందిస్తాడా? లేదా అనేది చర్చనీయాంశమైంది. ఎందుకంటే, సినిమా రిలీజ్ ముందు ఇలా జరుగుతుంది అంటే ఆ దెబ్బ సినిమా నిర్మాతకి తప్ప మరి ఇంకెవ్వరికి కాదు.
123K Tweets #BoycottLaila
— Bhargav Reddy (@mbrforjagan) February 11, 2025
ఇది Just Teaser మాత్రమే
మేము మారము మేము జగన్ గురించి ఇలాగే మాట్లాడతాం అంటే
Feb 14th release na #DisasterLaila 200k tweets పడతాయి 💯
పగిలేదే మీకే రా 🤙🔥 pic.twitter.com/KNH4USDPTa
అసలేం జరిగింది:
ఫిబ్రవరి 9న ఈవెంట్ లో " లైలా మూవీలో మేకల సత్తిని పట్టుకు రండ్రా అని ఒకతను చెప్తాడని, ఆ షాట్ గ్యాప్ లో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే 70, 80 మొత్తం కలిపి 150 ఉన్నాయని పృథ్వీ తెలిపాడు. సినిమా క్లైమాక్స్లో మరో సీన్ ఉందని, అందులో తన బామ్మర్ది రాగానే విలన్లు తనను వదిలేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు మాత్రమే ఉన్నాయని పృథ్వీ మాట్లాడాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పృథ్వీ చేసిన కామెంట్స్ తో ‘‘బైకాట్ లైలా మూవీ’’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇవాళ ఫిబ్రవరి 11న కూడా బైకాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ వస్తోంది. మరో మూడు రోజుల్లో సినిమా విడుదల పెట్టుకుని లైలా మూవీ బైకాట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లైలా మూవీ వివాదంపై చిత్ర నిర్మాత సాహు గారపాటి, హీరో విశ్వక్ సేన్ రియాక్ట్ అయ్యారు.
ALSO READ | Sankranthiki Vasthunam: ఈ విజయం కలా? నిజమా?.. మూతబడిన థియేటర్లని కళకళలాడించింది: విక్టరీ వెంకటేష్
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. లైలా మూవీ ఈవెంట్లో జరిగిన దానికి సారీ చెపుతున్నాను. ఎవరో ఒకరు తప్పు మాట్లాడితే.. మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా అని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదని.. అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధంలేదని క్లారిటీ ఇచ్చారు విశ్వక్ సేన్. అలాగే అతను మాట్లాడింది తప్పు.. కావాలంటే అతనిని సినిమాలు వదిలేసి రాజకీయాలు చేసుకోమనండి అభ్యంతరం లేదు. సినిమా ని సినిమాగానే ఉంచండి అంటూ వాపోయారు.