లైలా మూవీ ఈవెంట్ లో 11 మేకల కామెంట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ స్పందించారు. దిగివచ్చి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు 2025, ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం వీడియో రిలీజ్ చేశారు. సినిమాను సినిమాగా చూడాలని.. లైలా బాయ్ కాట్ చేయటం తప్పు అన్నారు. నేను చేసిన వ్యాఖ్యలు, కామెంట్లతో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ సారీ చెప్పారు పృథ్వీరాజ్.
ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి ధియేటర్లలో హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృధ్వీ చేసిన 150 మేకలు.. చివరికి 11 మేకలు ఉన్నాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు అన్నట్లుగా కామెంట్ చేశారు. దీంతో వైసీపీ #boycotlailamovie అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది.
Also Read :- లైలా సినిమా టీమ్ ని విష్ చేసిన మెగా హీరో..
డ్యామేజ్ కంట్రోల్ కోసం లైలా మూవీ హీరో విశ్వక్ సేన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. వైసీపీ వెనక్కి తగ్గలేదు. పృథ్వీ స్వయంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో మూవీ రిలీజ్ అవుతుండగా.. పృథ్వీరాజ్ క్షమాపణలు చెబుతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు.
రాజకీయాలు మాట్లాడుకోవటానికి చాలా వేదికలు ఉన్నాయని.. అక్కడ మాట్లాడతానని.. ఇప్పటికి అయితే సారీ అంటూ చెప్పుకొచ్చారు. లైలా మూవీ వరకు రాజకీయాలను వదిలేయాలని.. దీన్ని ఇంతటితో ముగించాలని పిలుపునిచ్చారు. లైలా చూడండి అంటూ సినీ అభిమానులను కోరారు.
వైసీపీకి సారీ చెప్పిన కమెడియన్ పృథ్వీరాజ్ : లైలా సినిమాకు మద్దతివ్వండి#PrudhviRaj #Laila #LailaMovie pic.twitter.com/w38TS1FFAf
— తెనాలి రామకృష్ణుడు (@vikatakavi369) February 13, 2025