BoycottLaila: బాయ్ కాట్ లైలా మూవీ : 11మేకలే మిగిలాయ్ అంటూ పృథ్వీ వ్యాఖ్యలతో పొలిటికల్ వార్

BoycottLaila: బాయ్ కాట్ లైలా మూవీ : 11మేకలే మిగిలాయ్ అంటూ పృథ్వీ వ్యాఖ్యలతో పొలిటికల్ వార్

విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం ‘లైలా’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సాహు గారపాటి నిర్మించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతోన్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ఆదివారం (ఫిబ్రవరి 9న) జరిగింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు నటుడు, కమెడియన్ పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ పెద్ద నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి. 

సోషల్ మీడియాలో BoycottLaila అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అసలు కమెడియన్ పృథ్వీ రాజ్ మాట్లాడిన మాటలు ఏంటీ? BoycottLaila అని ఎందుకు ట్రెండ్ అవుతుందో వివరాలు చూద్దాం.

లైలా షూటింగ్ సందర్భంలో భాగంగా పృథ్వీ రాజ్ ఒక సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ..'మేకల సత్యం క్యారెక్టర్ ఒకటి ఉంటుందని.. అప్పుడొక యాదృచ్చికంగా ఒకటి జరిగిందని' చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

" లైలా మూవీలో మేకల సత్తిని పట్టుకు రండ్రా అని ఒకతను చెప్తాడని, ఆ షాట్ గ్యాప్ లో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే 70, 80 మొత్తం కలిపి 150 ఉన్నాయని పృథ్వీ తెలిపాడు. సినిమా క్లైమాక్స్లో మరో సీన్ ఉందని, అందులో తన బామ్మర్ది రాగానే విలన్లు తనను వదిలేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు మాత్రమే ఉన్నాయని పృథ్వీ తెలిపారు. అయితే, పృథ్వీ రాజ్ తనదైన శైలిలో కొందరిని టార్గెట్ చేసి మాట్లాడినట్లు మాట్లాడారు.

దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇపుడు ఆ మాటలు వైసీపీ పార్టీని ఉద్దేశించి మాట్లాడారని ఆ పార్టీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గతంలో 151 సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చేసిందని గుర్తుచేస్తూ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారంటూ పొలిటికల్ వార్ జరుగుతుంది. ఇక లైలా సినిమాను రిలీజ్ కాకుండా బాయ్ కాట్ చేస్తామంటూ X లో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ వార్ ఎక్కడికెళ్ళి ఆగనుందో చూడాలి. 

మరి ఈ వ్యాఖ్యల పైన నటుడు పృథ్వీ రాజ్ స్పందిస్తాడా? లేక లైలా టీమ్ స్పందించి క్లారిటీ ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే, కమెడియన్ పృథ్వీ రాజ్ చేసిన కంమెంట్స్ లైలా సినిమాకు పెద్ద డ్యామేజ్గా మారనుందని సినీ వర్గాలు అంటున్నాయి.