
రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా వార్నర్ కి రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ డేవిడ్ వార్నర్ కి క్షమాపణలు తెలిపాడు.
ఇందులభాగంగా ఓ వీడియో బైట్ ని కూడా రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో "ఐ లవ్ డేవిడ్ వార్నర్.. నాకు అతడి క్రికెట్ అంటే చాలా ఇష్టం..డేవిడ్ వార్నర్ కి తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని, అలాగే మా యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమని తెలిపాడు.. మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయామని ఏదేమైనా ఈ జరిగిన సంఘటనకిగానూ మీరెవరైనా ఫీల్ అయ్యుంటే సారీ.. నేను కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటానని స్పష్టం చేశాడు." దీంతో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు.
#DavidWarner కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్#Robinhood #RajendraPrasad pic.twitter.com/HpFqEOvbRt
— Ramesh Pammy (@rameshpammy) March 25, 2025
ఈ విషయం ఇలా ఉండగా సోషల్ మీడియాలో తెలుగు సాంగ్స్ రీల్స్ చేస్తూ అలరించిన డేవిడ్ వార్నర్ నితిన్గ్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో విలన్ రోల్ లో నటించాడు. ఈ సినిమా మార్చ్ 28న ఆడియన్స్ ముందుకు రాబోతోంది.