
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. 38 ఏళ్ల గాయత్రికి శుక్రవారం(అక్టోబర్ 04) రాత్రి గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె.