రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కూతురు గాయత్రి అక్టోబర్ 4న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన కూతురు అమ్మలా వచ్చి, మళ్లీ తనను వదిలి వెళ్లిపోయిందని ఎంతో కన్నీరుమున్నీరు అయ్యారు.
ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోలు, దర్శకులు స్వయంగా ఇంటికి వెళ్లి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇక కూతురు మరణం తర్వాత మొదటిసారి సినిమా ఫంక్షన్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
సాయిరోనక్, ప్రగ్యా నగ్రా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'లగ్గం'. వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. రమేశ్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో జరిగే స్టోరీతో ఈ మూవీని తీశారు. ఇందులో కీలక పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్‌కి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంటే మక్కువ ఎక్కువ. అందుకే వాళ్ల ఊరిలో అందరికీ సాఫ్ట్‌వేర్ అల్లుళ్లను తీసుకొస్తా అంటాడు.
Also Read : కొరియోగ్రాఫర్ జానీకి బెయిల్ మంజూరు
ఈ నేపథ్యంలో లగ్గం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో కూతురు మరణం తర్వాత మొదటిసారి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన కూతురు అమ్మలా వచ్చి, మళ్లీ తనను వదిలి వెళ్లిపోయిందని ఎంతో కన్నీరుమున్నీరు అయ్యారు. లగ్గం చిత్రం ఒక తండ్రీ కూతుళ్ల కథ కావడంతో తన కూతురిని గుర్తుకుతెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు రాజేంద్రప్రసాద్. అలాగే పెళ్లి పుస్తకం లాంటి క్లాసిక్ సినిమా తీసిన నేను.. ఇపుడు తెలంగాణ బిడ్డగా లగ్గం మూవీలో నటించినందుకు ఆనందంగా ఉన్నానని చెప్పారు. ఇక ఈ లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజేంద్ర ప్రసాద్‌తోపాటు సప్తగిరి, రోహిణి, నిర్మాత, డైరెక్టర్ రమేశ్ చెప్పాల వంటి ప్రముఖులు హాజరు అయ్యారు.
ఇకపోతే.. 38 ఏళ్ల గాయత్రి ప్రొఫెషనల్ న్యూట్రీషియన్. గాయత్రి కూతురు సాయితేజస్విని మహానటి సినిమాలో చిన్ననాటి కీర్తిసురేష్ పాత్రలో కనిపించింది.
రాజేంద్రప్రసాద్ తల్లి కమలేశ్వరి దేవి ఆయన చిన్నతనంలోనే మరణించగా.. తన కుమార్తె గాయత్రిలోనే తన తల్లిని చూసుకుంటానని ఒకానొక సినిమా ఈవెంట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇపుడు కూతురు గాయత్రి మరణం ఆయన్ను ఎంతగా బాధిస్తుందో అర్థం చేసుకోవచ్చు.