
హైదరాబాద్, వెలుగు: హాస్పిటాలిటీ రంగంలోకి వర్మ స్టీల్స్ అడుగుపెట్టింది. అరైవల్ పేరుతో లగ్జరీ హోటల్‌ను శనివారం అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ మాదాపూర్లో గల ఈ హోటల్‌ను యాక్టర్ రానా ప్రారంభించారు. కార్యక్రమంలో వర్మ స్టీల్స్ చైర్మన్ వర్మతోపాటు సినీ దర్శకుడు కొరటాల శివ, సినీ నిర్మాత సునీల్ నారంగ్, సినీ ఆర్టిస్టులు శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, కృష్ణుడు, రజిత, భావన హాజరయ్యారు.
తమ హోటల్ కస్టమర్లకు కస్టమైజ్డ్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం ప్రకటించింది. అడ్వాన్స్డ్ స్మార్ట్ టెక్నాలజీతో అత్యాధునిక గదులను, సూట్ రూమ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రపంచ స్థాయి చెఫ్‌లతో కూడిన ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ సౌకర్యం తమ ప్రత్యేకత అని తెలిపింది. భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్కెట్లలోనూ హోటళ్లు తెరుస్తామని
వర్మ చెప్పారు.