టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా రవితేజ షూటింగ్లో గాయపడ్డారు. నూతన డైరెక్టర్ భోగవరపు భాను దర్శకత్వంలో రవితేజ హీరోగా ఆర్టీ 75 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో రవితేజకు గాయమైనట్లు సమాచారం. కుడి చేతి కండరం చిట్లడంతో మూవీ యూనిట్ రవితేజను యశోదా ఆసుపత్రిలో జాయిన్ చేయగా.. వైద్యులు సర్జరీ చేశారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బెడ్ రెస్ట్ తీసుకోవాలని.. కనీసం ఆరు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు రవితేజకు సూచించినట్లు తెలుస్తోంది.
ALSO READ | షూటింగ్లో గాయపడిన హీరో రవితేజ: ఆస్పత్రిలో ఆపరేషన్
రవితేజ షూటింగ్లో గాయపడ్డట్లు జోరుగా ప్రచారం జరుగుతోన్న ఈ తరుణంలో.. రవితేజకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో.. ఐసీయూలో రవితేజకు వైద్యులు నోట్లో పైపులు పెట్టి చికిత్స అందిస్తుండగా.. మరోవైపు హీరో చేతికి రక్తం కారుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే, దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘రవితేజకు అంత తీవ్ర స్థాయిలో గాయం కాలేదని’ కొందరు.. ‘అది మూవీ షూటింగ్లో తీసిన ఫొటో’’ అని మరికొందరు.. ‘అసలు ఆ ఫొటో నిజమేనా’ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Mass Maharaja #Raviteja recently sustained a muscle tear in his right hand during the filming of #RT75. Despite the injury, he continued to shoot, which unfortunately led to further aggravation.
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 23, 2024
Yesterday, He underwent a successful surgery at Yashoda Hospitals and as per…
గాయానికి గురైన తమ అభిమాన నటుడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే, రవితేజ గాయంపై గానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోపై కానీ హీరో టీమ్ అధికారికంగా ఎక్కడ స్పందించలేదు. మరీ రవితేజ నిజంగా గాయపడ్డారా లేదా అన్న విషయం తెలియాలంటే అతడి టీమ్ స్పందిస్తే గానీ తెలియదు.