బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఘోరమైన దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి దారుణంగా పొడిచేశాడు. గురువారం (జనవరి16) తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సైఫ్ పై ఏకంగా ఆరు కత్తిపోట్లు పొడిచాడు దుండగుడు. ఇందులో రెండు పోట్లు లోతుగా దిగటంతో సైఫ్ పరిస్థితి విషమించింది. తీవ్రంగా గాయపడ్డ సైఫ్ ను ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు తరలించారు. ఆరు కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావం జరిగి సైఫ్ కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. నీరజ్ఉత్తమని స్టేట్మెంట్:
- ఘటన జరిగిన తర్వాత 3.30 గంటలకు లీలావతి హాస్పిటల్ కు తీసుకొచ్చారు.
- ఆరు కత్తిపోట్లలో ఒకటి వెన్నెముకకు దగ్గరగా దిగింది.
- న్యూరో సర్జన్ డా. నితిన్ దాంగే, కాస్మొటిక్ సర్జన్ డా.లీనా జైన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించాము.
- న్యూరో సర్జరీ పూర్తయ్యింది.. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంది.
- సైఫ్ కండీషన్ ప్రస్తుతం ఔట్ ఆఫ్ డేంజర్.
సైఫ్ టీమ్ స్టేట్ మెంట్:
- సైఫ్ అలీఖాన్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి ప్రయత్నించాడు.
- ఈ క్రమంలో సైఫ్ పై కత్తితో దాడికి దిగాడు.
- పోలీసుల దర్యాప్తు జరుతోంది. దీనిపై ఎక్కువ విషయాలు చెప్పలేం.
- సైఫ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తాం.
- మీడియా, అభిమానులు సంయమనం పాటించాలి.
Also Read :- సైఫ్ అలీఖాన్‌పై దాడి ఎలా సాధ్యం..?
ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలిసిన వివరాలు:
- ముంబైలోని సద్గురు శరణ్ బిల్డింగ్ దగ్గర ఉన్న సైఫ్ ఇంటిలోకి దొంగ ప్రవేశించాడు.
- సైఫ్, అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దొంగఇంట్లోకి ప్రవేశించాడు.
- ఆ సమయంలో హీరో సైఫ్ కు, దొంగకు మధ్య గొడవ జరిగింది.
- కత్తితో దొంగ పొడవడంతో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి.
- ఈ ఘటనపై బాంద్ర పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.
పనిమనిషికి కూడా గాయాలు:
- సైఫ్ ఇంట్లో పనిచేసే ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు
- ఈ ఘటనలో ఒక వర్కర్ కు గాయాలయ్యాయి.
- ఈ కేసును దర్యాప్తు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది బాంద్ర క్రైమ్ బ్రాంచ్ .
- నేరస్తున్ని పట్టుకునేందుకు ఏడు టీమ్ లను రంగంలోకి దింపింది.
- ఇందులో ఒక టీమ్ సీసీటీవీ ఫుటేజ్ లను స్కానింగ్ చేస్తోంది.
- కొన్ని టీమ్స్ ముంబై సర్చ్ ఆపరేషన్ చేపడతారు.
- మరో మూడు టీమ్ లు ముంబైలోని వివిధ ప్రాంతాలలో సర్చ్ చేస్తారు.
కరీనా కపూర్ టీమ్ స్టేట్మెంట్
- సైఫ్ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ సైఫ్ పై తీవ్రంగా దాడి చేశాడు.
- సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఇంట్లో ఉండగా దొంత ఇంట్లోకి ప్రవేశించాడు.
- ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు.
- కరీనా కపూర్ తో పాటు మిగతా ఫ్యామిలీ సురక్షితంగా ఉంది.