Saif Ali Khan: ఆసుపత్రి నుండి హీరో సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్

Saif Ali Khan: ఆసుపత్రి నుండి హీరో సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్

నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) జనవరి 21న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 16న బాంద్రాలోని తన ఇంట్లో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్.. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.

సైఫ్ ఆరో రోజుల అనంతరం మంగళవారం (జనవరి 21న) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా ఇంటికి వెళ్లిపోయారు. సైఫ్ అలీఖాన్ కోలుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. డిశ్చార్జ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వెంట అతని భార్య కరీనా కపూర్ ఉన్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే:

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై బుధవారం (జవనరి 16) దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో ఎటాక్ చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

Also Read :- అందుకే బిగ్‌బాస్‌ సెట్‌ నుంచి బయటికి వచ్చేశా

సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సైఫ్ అలీఖాన్‎పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. ఈ ఘటన ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముంబై పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.