సాయికుమార్ నటించిన పోలీస్ స్టోరీ టాలీవుడ్ లో ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి క్రేజీ సినిమాకు మరో సీక్వెల్ రాబోతుంది. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయికుమార్ .. నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీ చేస్తున్నట్లు చెప్పారు. పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు సెల్యూట్ చేశారు. నిజమైన హీరోలు పోలీసులన్నారు. పోలీసు గెటప్ వేస్తే..తమలో ఒక పౌరుషం కనిపస్తుందని.. నిజమైన పోలీసులకు ఇంక ఎంత షౌరుషంగా ఉంటుందోనన్నారు. తాను పోలీస్ స్టోరి చేసి 25 సంవత్సరాలు పూర్తయిందని..త్వరలోనే నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీతో మీ ముందుకొస్తానన్నారు.
తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డిపై ప్రసంశల కురిపించారు సాయి కుమార్. పోలీసు అధికారి పోలంలోకి దిగడం అంటేనే, ఆయన మనుషుల్లో ఎలా కలిసి పోయారో అర్ధం చేసుకోవచ్చన్నారు. రమేష్ రెడ్డి లాంటి అధికారి ఉన్న చోట మంచి హ్యూమానిటీ కూడా ఉంటుందన్నారు. కనిపించే మూడు సింహాలు..పోలీసులు, వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులని అన్నారు . ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా..స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారన్నారు.
మరోసారి నేపాల్ దొంగల బీభత్సం.. మత్తిచ్చి ఇళ్లు గుల్ల చేసి పరార్