
నటుడు సాయికుమార్ కు ఆదివారం (మార్చి 23) కుమ్రంభీం 2024 జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పురస్కారం అందుకున్నారు సాయికుమార్. టెలివిజన్ రచయతల సంఘం అధ్యక్షుడు, డైరెక్టర్ నాగబాల సురేష్ కుమార్ అధ్వర్యంలో అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది.
భారత్ కల్చరల్ అకాడమి హైదరాబాద్, ఓం సాయి ఆర్ట్స్ క్రియేషన్స్, ఆదివాసీ కళా పరిషత్, నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య కలిసి ఈ అవార్డును అందిస్తున్నాయి. హీరో సాయి కుమార్ తో పాటు మోహన్, శివారెడ్డి, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ALSO READ : హీరోయిన్ పేర్లు కూడా సినిమా పోస్టర్స్ లో ఉండవు.. ఎందుకంత వివక్ష: పూజా హెగ్డే