బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్లను తీవ్రంగా హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాశారు. ‘‘మూసేవాలా జైసా కర్ దూంగా’’ అని అందులో పేర్కొన్నారు. సిద్ధూ మూసేవాలా అనే పంజాబీ సింగర్ మే 29న దారుణ హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో అదే తరహాలో చంపుతామంటూ సల్మాన్ ఖాన్, సలీంఖాన్ లకు హెచ్చరిక లేఖ రావడం కలకలం సృష్టించింది. సలీంఖాన్ రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రా చీచ్ లో వాకింగ్ కు వెళ్లారు. వాకింగ్ చేసే క్రమంలో ఆయన ప్రతిరోజూ ఒక బెంచీపై కూర్చుంటారు. అయితే ఆ బెంచీపై ఒక లేఖను సలీంఖాన్ భద్రతా సిబ్బంది గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా తీవ్ర హెచ్చరికలు ఉన్నాయి. దీనిపై బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. బాంద్రా బీచ్ పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజీని సేకరించి పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ లేఖను అక్కడ పెట్టి వెళ్లిన వారి పోలికలను తెలుసుకునేందుకుగానూ పరిసర ప్రాంత ప్రజలను విచారిస్తున్నారు.
మరిన్ని వార్తలు..