శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్ దర్శించుకున్నారు. శనివారం  ( ఏప్రిల్ 20)ఉదయం  వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఆలయం వెలుపల సంయుక్తా మీనన్ మీడియాతో మాట్లాడుతూ…. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. నేను కోరుకున్న దానికన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా మంచి లైఫ్ ఇచ్చారని తెలిపారు. శర్వానంద్ తో కలసి ఓ సినిమా నటిస్తున్నట్లు తెలిపారు. ఇక స్వయంభూ సినిమా చేస్తున్నానన్నారు.