చిరు 'గాడ్ ఫాదర్' నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ మూవీ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ఇందులో జైదేవ్ పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్. ఈ చిత్రంలో నయనతార, పూరి జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే నయనతార ఫస్ట్ లుక్ విడుదలైయింది. సత్యప్రియ జైదేవ్ గా నయనతార ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జైదేవ్ గా సత్యదేవ్ ఫస్ట్ లుక్ కూడా క్యూరియాసిటీని పెంచింది. 

ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది. 

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా

నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్

సమర్పణ: కొణిదెల సురేఖ

బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్

సంగీతం: ఎస్ ఎస్ థమన్

డీవోపీ: నీరవ్ షా

ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు

పీఆర్వో: వంశీ-శేఖర్