Sathyaraj: నా సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం.. మోదీ బయోపిక్లో చేయను: సత్య రాజ్

Sathyaraj: నా సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం.. మోదీ బయోపిక్లో చేయను: సత్య రాజ్

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జీవిత కథలు తెరపై సినిమాలుగా వచ్చాయి. ఇలాంటి సినిమాలో నటించేందుకు స్టార్స్ సైతం ముందుకు వస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి జీవితకథ తెరపైకి రానుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi). అవును.. మోడీ జీవిత కథ ఆధారంగా విశ్వనేత(Vishwanetha) పేరుతో సినిమా రానుందట. 

అయితే.. తాజాగా ఈ సినిమా నుండి ఓ క్రేజీ న్యూస్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలోవైరల్ గా మారింది. అదేంటంటే.. మోడీ బయోపిక్ లో బాహుబలి ఫేమ్ నటుడు సత్య రాజ్ నటిస్తున్నారు అనే వార్తలు వినిపించాయి. ఈ నేపధ్యంలోనే తాజాగా స్పందించాడు నటుడు సత్య రాజ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ బయోపిక్‌లో నేను నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

ఈ ప్రాజక్ట్‌ గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ వార్తలు చూసి నాకు నేనే షాకయ్యాను.దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. భవిష్యత్‌లో మోదీ బయోపిక్‌ కోసం నన్ను ఎవరు సంప్రదించినా నేను చేయననే చెప్తాను. ఎందుకంటే అది నా సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం.. అంటూ క్లారిటీ ఇచ్చాడు సత్య రాజ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.