Actor Satyadev: క్రైమ్ థ్రిల్లర్తో రానున్న సత్యదేవ్..డైరెక్టర్ ఎవరంటే?

Actor Satyadev: క్రైమ్ థ్రిల్లర్తో రానున్న సత్యదేవ్..డైరెక్టర్ ఎవరంటే?

యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ స‌త్యదేవ్ (Satyadev) గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక‌మైన ప‌రిచ‌యం అక్కర్లేదు.డిఫరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న వెర్సటైల్ హీరో ఆయ‌న‌. తనదైన శైలిలో సినిమాలు చేస్తూనే..విలన్గా, సపోర్టింగ్ యాక్టర్గా రాణిస్తున్నాడు.కేవలం తెలుగు లోనే కాకుండా..బాలీవుడ్, తమిళ చిత్రాలలో కూడా తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 

లేటెస్టుగా సత్యదేవ్..ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో హీరోగా నటించబోతున్నాడు. తమిళ సినిమా ఎన్నా సొల్ల పొగిరై దర్శకుడు హరిహరన్(Hariharan)తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్లో బిజీగా ఆయ్యాడు. డైరెక్టర్ హరిహరన్ 1970ల నాటి క్రైమ్ థ్రిల్లర్తో వస్తోన్న ఈ సినిమాకు నిలా వరుమ్ వేలై పేరుతో తమిళంలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదే సినిమాను ఏక కాలంలో తెలుగులో సత్యదేవ్తో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హరిహరన్.

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల షూటింగ్స్..వేరు వేరు నటులతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే విషయంపై డైరెక్టర్ హరిహరన్ మాట్లాడుతూ.. ఈ మూవీ  50 సంవత్సరాల క్రితం జరిగినది కాబట్టి..అప్పటి కాలాన్ని బేస్ చేసుకొని షూటింగ్ చేస్తున్నాం..ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కేరళలో ప్లాన్‌ చేసి, ఆ తర్వాత చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని తెలిపారు. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన కాయాదు లోహర్(Kayadu Lohar) నటించనుంది. 

ఇటీవల సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు. ఆ చిత్రం హిందీలోనూ విడుదలైంది. ఈ చిత్రంలో సత్యదేవ్ పూర్తి స్థాయి పాత్రలో నటించి మంచి మార్కులను కొట్టేశారు. అక్షయ్ కుమార్ రామ్ సేతు చిత్రం సత్యదేవ్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా సక్సెస్ సాధించి ఆయన కలను నేరవేర్చింది.