కొత్త తరహా కాన్సెప్టులు, డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్..ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘కృష్ణమ్మ’ మూవీ ఒకటి.కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వి. వి. గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు.
ఫస్ట్‌లుక్‌తో మెస్మరైజ్ చేసిన సత్యదేవ్..టీజర్‌తో ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చాడు. కానీ,ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ రాకపోయేసరికి సత్యదేవ్ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు.తాజాగా ఫ్యాన్స్ ఆశలకు ఊపిరి పోసేలా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ వీడియో యూట్యూబ్ వేదికగా ఒక వీడియో విడుదల చేసింది.
ఇందులో సత్యదేవ్ జైల్‌లో ఉండగా 'భద్ర రిలీజ్ అవ్వబోతున్నాం రా అంటూ యాక్టర్ మీసాల లక్ష్మణ్ అనగా ..సత్యదేవ్ ఎప్పుడు విడుదల తేదీ అంటూ ఆవేశంగా చెప్పే డైలాగ్ ఇంటెన్స్ పెంచుతోంది.రా అండ్ రస్టిక్‌గా ఉన్న విజువల్స్ ఆకట్టు కున్నాయి. సత్యదేవ్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తు న్నాడు.ఈ మూవీలో అతిరా రాజీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా..కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.
విజయవాడ నగరంలో కృష్ణనది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్‌కి, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా కథ. ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవరికీ తెలీదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా పుట్టిన ప్రతివాడికీ ఏదో ఓ కథ ఉండే ఉంటుంది. కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ కెలకకూడదు. ఎలాంటి సంఘటన ముగ్గురి జీవితాల్ని మలుపు తిప్పింది? ఈ క్రమంలో వీరికి ఎదురైన సవాళ్లేంటి? అన్నది థియేటర్‌లో చూడాల్సిందే.