Zebra Movie: మనీ, మనిషి.. నిజస్వరూపం జీబ్రా : సత్యదేవ్

Zebra Movie: మనీ, మనిషి.. నిజస్వరూపం జీబ్రా : సత్యదేవ్

డిఫరెంట్ కాన్సెప్టులతో నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్..  కన్నడ నటుడు డాలీ ధనంజయతో  కలిసి మరో లీడ్‌‌గా నటించిన చిత్రం ‘జీబ్రా’.  ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన చిత్రం  ఈరోజు  విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ చెప్పిన విశేషాలు. 

‘‘బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరివరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే  ఉంటుంది.  అందుకే  సినిమాకి  జీబ్రా అనే టైటిల్ పెట్టారు.  నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్‌‌తో వచ్చింది.  అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి జీబ్రా టైటిల్ యాప్ట్. బ్యాంక్‌‌ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. డైరెక్టర్ ఈశ్వర్ గతంలో బ్యాంకులో పనిచేసిన అనుభవంతో.. అలాగే బ్యాంకింగ్ సిస్టమ్‌‌లో  ఆయన చూసిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందించాడు. నేను బ్యాంకర్‌‌‌‌గా నటించా. కామన్ మ్యాన్ లుక్‌‌లో కనిపిస్తా.  

ధనంజయ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా కనిపిస్తాడు.  మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. ధనంజయ పాత్రలో మంచి శ్వాగ్ ఉంటుంది.  -సునీల్, సత్యరాజ్, సత్య, ప్రియా భవానీ శంకర్ ఇలా పాత్రలన్నీ రెండు వరల్డ్స్ నుంచి ఎలా కలుస్తాయనేది ఇంటరెస్టింగ్‌‌గా  ఉంటుంది. ప్రతి పాట కథలో భాగంగానే వస్తుంది. రవి బస్రూర్ టెర్రిఫిక్ బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు అందించాడు.  పెయిడ్ ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో టీమ్ అంతా ఎక్సయిటింగ్‌‌గా ఉన్నాం. ఇక నేను నటించిన ‘ఫుల్ బాటిల్’ రిలీజ్‌‌కు రెడీగా ఉంది.  వెంకటేష్ మహాతో ఓ సినిమా చేయాల్సి ఉంది’’.