ఎంతకు తెగించార్రా.. క్రెడిట్ కార్డులో రూ.5 లక్షలు కాజేశారు

ఎంతకు తెగించార్రా.. క్రెడిట్ కార్డులో రూ.5 లక్షలు కాజేశారు

గంగూబాయి కతియావాడి ఫేమ్ శంతను మహేశ్వరి తాను మోసానికి  గురైనట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. 2024 జనవరి 30వ తేదీన తనకు తెలియకుండానే తన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ ఖాతాలో రూ. 5 లక్షలను స్కామర్లు అపహరించినట్లుగా తెలిపాడు.  తాను ఓ రెస్టారెంట్‌కి వెళ్లి బిల్  చెల్లించడానికి ప్రయత్నిస్తున్న టైమ్ లో తన  ఖాతాలో డబ్బులు ఖాళీ అయిపోయినట్లుగా చూపించడం తనకు షాక్ కు గురిచేసిందని తెలిపాడు. అంతేకాకుండా తన క్రెడిట్ ఖాతాలో అడ్రస్, ఫోన్ నంబర్,  రిజిస్టర్డ్ ఇమెయిల్  మొత్తం ఛేంజ్ చేశారన్నాడు.   దీనిపై తాను  కస్టమర్ సర్వీస్‌ను సంప్రదిస్తూనే ఉన్నానని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని శంతను మహేశ్వరి వెల్లడించాడు.