బిగ్‌బాస్ సీజన్ 7(Bigg boss season7)లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అదే శివాజీ(Shivaji) అనే చెప్పాలి. తన ఆటతో, తన అనుభవంతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు శివాజీ. దీంతో ఆయనే ఈ సీజన్ విన్నర్ అనే కన్ఫర్మేషన్ కి కూడా వచ్చేశాడు ఆడియన్స్. అయితే.. సడన్ గా బిగ్ బాస్ శివాజీని ఇంటినుండి బయటకు పంపించేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్. ఇది చుసిన ఆడియన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. శివాజీ బయటకు వెళ్లిపోవడం ఏంటి. ఆయన వెళ్ళిపోతే ఈ సీజనే లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే శివాజీ బయటకు వెళ్ళడానికి అసలు కారణం ఏంటంటే.. క్రితం వారం జరిగిన టాస్క్ లో శివాజీ చేతికి గాయం అయ్యింది. వారం రోజులుగా ఆయన ఆ చేయి నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. దీంతో అయనను పరీక్షించిన డాక్టార్స్ ఆయనకు ట్రీట్మెంట్ అండ్ రెస్ట్ అవసరమని సూచించారట. అంతే కాదు నిన్న జరిగిన ఎలిమినేషన్ లో కూడా శివాజీ నా చేయి బాగోలేదు, కాస్త నొప్పిగా ఉంది.. అందుకే నయని పావనికి బదులుగా నన్ను బయటకు పంపించండి అని నాగార్జునను రిక్వెస్ట్ చేశారు. దానికి నాగార్జున నో చెప్పారు.
ఆ తరువాత శివాజీ నొప్పో కాస్త ఎక్కువ కావడంతో ఆయనను కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి బయటకు వెళ్లాలని సూచించాడు బిగ్ బాస్. దీంతో శివాజీ ఆ రూమ్ నుండి బయటకు వచ్చి ఇంటి సభ్యులతో నన్ను బయటకు వెళ్ళేమన్నారు వెళుతున్నానని చెప్పారు. దీంతో కంటెస్టెంట్స్ అందరు ఒక్కసారిగా షాకయ్యారు. శివాజీ బయటకు వెళ్లొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఆయన మాత్రం ఇంటినుండి బయటకు వెళ్లిపోయారు. ఇక ఇంటినుండి బయటకు వచ్చిన శివాజీకి చికిత్స అందించనున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.
వైద్య పరీక్షల నిమిత్తం బయటకు వెళ్లిన శివాజీ మళ్ళీ ఇంట్లోకి వస్తారా అనే అనుమానం అందరిలోనూ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు ఆయన తప్పకుండ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారు. కానీ దానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని సమాచారం. అప్పటివరకు బయటే ఉంటారా లేక సీక్రెట్ రూమ్ లో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక బిగ్‌బాస్-3 సీజన్‌లో కూడా ఇలాగే నూతన్ నాయుడు చేతికి గాయం అయినప్పుడు.. రెండుమూడు రోజులు విశ్రాంతి తరువాత మళ్లీ హౌస్‌లోకి పంపించారు. కాబట్టి ఇప్పుడు శివాజీని కూడా మళ్ళీ బిగ్‌బాస్‌లోకి పంపించడం ఖాయం అని తెలుస్తోంది.