యాక్టర్ శివాజీ రాజాకు హార్ట్ఎటాక్

యాక్టర్ శివాజీ రాజాకు హార్ట్ఎటాక్

యాక్టర్, కమెడియన్, మూవీ ఆర్టిస్ట్ అసిసోయేష‌న్ మాజీ అధ్య‌క్షుడు శివాజీరాజా గుండెపోటుకి గుర‌య్యారు. అది గమనించిన ఆయన కుటుంబ స‌భ్యులు వెంట‌నే బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రికి త‌రలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బీపీ ఒక్క‌సారిగా డౌన్ కావ‌డంతో ఆయ‌న‌కి హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని వైద్యులు తెలిపారు. అయితే ఆయనకు శ‌స్త్ర చికిత్స చేసి స్టంట్ వేసే అవ‌కాశముందని వైద్యులు పేర్కొన్నారు.

లాక్‌డౌన్ వ‌ల్ల కొద్ది రోజులుగా శివాజీ రాజా ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక నగర శివార్ల‌లోని త‌న ఫాం హౌజ్‌‌లో వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆయన త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో పండిన కూర‌గాయ‌ల్ని పేద‌ల‌కు ఉచితంగా అంద‌జేస్తున్నారు.

For More News..

జైలులో మర్మాంగాలను కత్తిరించుకున్న ఖైదీ

కారులో బిడ్డను ప్రసవించిన గర్భవతి