Shiva Rajkumar: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న శివ రాజ్‌కుమార్‌.. అభిమానులతో సెల్ఫీలు

Shiva Rajkumar: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న శివ రాజ్‌కుమార్‌.. అభిమానులతో సెల్ఫీలు

కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) RC 16లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు (మార్చి 22న) ఆయన జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణితో కలిసి నేడు ఉద‌యం పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న శివ‌రాజ్‌కుమార్ అమ్మవారికి ప్ర‌త్యేక పూజలు చేశారు.

అనంత‌రం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ నేపథ్యంలో శివన్నను చూసిన అభిమానులు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ALSO READ | Salaar Re Release: రీ-రిలీజ్‍లోనూ సలార్ వసూళ్ల ప్రభంజనం.. ఫస్ట్ డే ఎంత వచ్చిందంటే?

దర్శకుడు బుచ్చిబాబు, హీరో రామ్ చరణ్ కలయికలో వస్తోన్న RC 16లో శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే మార్చి 5న శివ రాజ్ కుమార్ లుక్ టెస్ట్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ క్రమంలో RC 16 షూటింగ్లో శివ రాజ్ కుమార్ జాయిన్ కానున్నాడు.

పీరియాడికల్‌‌ బ్యాక్‌‌ డ్రాప్‌‌ స్పోర్ట్స్‌‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌‌చరణ్‌‌ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వి కపూర్ నటిస్తోంది. ఇది జాన్వీకి తెలుగులో రెండవ ప్రాజెక్ట్. ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌‌‌‌తో దీన్ని నిర్మిస్తున్నారు.