ప్రముఖ సినీనటికి కరోనా పాజిటివ్

సినీ నటి శృతి హాసన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‎గా వచ్చిందని తెలిపారు. తనతో కొన్ని రోజులుగా టచ్‎లో ఉన్నవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని మళ్లీ మీ ముందుకు వస్తానని ఆమె అన్నారు. 

తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తున్న శృతి హాసన్.. తన తండ్రి కమల్ హాసన్ ఇమేజ్‎తో కాకుండా.. నటనతో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‎గా 2000 సంవత్సరంలో తన తండ్రి సినిమా ‘హే రామ్’ తో బాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఆ తర్వాత హీరోయిన్ గా 2009లో ‘లక్’ మూవీ ద్వారా కనిపించారు. తెలుగులోకి 2011లో సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా ద్వారా అడుగుపెట్టారు. అనంతరం గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు, క్రాక్ సినిమాలతో మెప్పించారు. ఆమె తన నటనతో ఇప్పటివరకు 13 అవార్డులు సొంతం చేసుకోగా.. 27 అవార్డులకు నామినేట్ అయ్యారు.

For More News..

ప్లాస్టిక్‎తో కలిగే ప్రమాదం.. కళ్లకు కట్టేట్లు చూపే వీడియో

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్