Siddharth: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు..సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్

Siddharth: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు..సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్

టాలెంటెడ్ హీరో సిద్ధార్ధ్(Siddharth) సినిమాలతో పాటు సామాజిక బాధ్యత కలిగిన నటుడు.ఆయన కెరీర్ మొదట్లోనే సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ కొన్నియాడ్స్ కూడా చేసాడు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువ అవుతుండటంతో..దాన్ని ఎలాగైనా అరికట్టాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు,సినీ ఇండస్ట్రీ వాళ్ళు తక్షణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే,తాజా విషయానికి వస్తే..ఇండియన్‌-2 రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో సినిమా టీం మీడియాతో ముచ్చటించింది.ఈ సందర్బంగా మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు హీరో సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.'ఎవరో చెబితే తాను ఫాలో కానని..నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు.బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు.ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.సిద్ధార్థ విడుదల చేసిన వీడియోని నటుడు,నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిద్ధార్థ్ మాటల్లోనే..

"భారతీయుడు సినిమాలో మేము జీరో టోలరెన్స్ గురించి మాట్లాడుతున్నాము.అవినీతి గురించి జీరో టోలరెన్స్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్ లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు నా మాటల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.ఆ తప్పుగా అర్ధం చేసుకున్న విషయాన్నీ వెంటనే క్లియర్ చేసేయాలని తెలుపుతూ వీడియో రిలీజ్ చేశారు హీరో సిద్ధార్ధ్.నేను పూర్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారిని సపోర్ట్ చేస్తున్నాను అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ని కూడా సపోర్ట్ చేస్తున్నాను. డ్రగ్స్ విషయంలో వాళ్ళు చేస్తున్న ఫైట్ ని కచ్చితంగా సినిమా ఇండస్ట్రీతో పాటు అందరం సపోర్ట్ చేసి తీరాల్సిందే.మన పిల్లల భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే కాకుండా మన చేతిలో కూడా ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ ని కాపాడుకోవడం మన కర్తవ్యం.

నేను 100% చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో ఉన్నాను.డ్రగ్స్ ని అరికట్టాలని రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నేను నా మద్దతు తెలియజేస్తున్నాను.గవర్నమెంట్ తో కలిసి సినీ పరిశ్రమ కూడా బెటర్ సొసైటీ కోసం కష్టపడాలని ఆయన ఆలోచనను మెచ్చుకుంటున్నాను. నా కెరీర్ మొత్తంలో నేను సామాజిక విషయాల్లో నా వంతు సహాయం నేను చేస్తా. నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. నేను మధ్యాహ్నం అన్నది మమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు.మేము మా అంతటా మేమే ముందుకు వచ్చి చేస్తున్నాం అని. ఈ విషయంలో డ్రగ్స్ మీద పోరాడుతున్న రేవంత్ రెడ్డి,ఆయన ప్రభుత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది సిద్ధార్ధ్ అన్నారు. అలాగే మా భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ కాబోతుంది.అందరు తప్పకుండ చూడాలని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.