
పవన్ కళ్యాణ్ లీడ్ రోల్‌లో సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’(OG). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్ ఏర్పడ్డాయి. అయితే మూవీ నుంచి అప్‌డేట్ వచ్చి చాలా రోజులైంది. దీంతో పవన్ కళ్యాణ్ ఏ ఈవెంట్‌కు వెళ్లినా అభిమానులు ‘ఓజీ.. ఓజీ..’అంటూ ఈ సినిమాను గుర్తుచేస్తున్నారు.
ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఓ ఇంటర్వ్యూలో ‘ఓజీ’ ఫస్ట్ సింగిల్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. ఫైర్ స్ట్రోమ్ అనే ఈ పాటను శింబు పాడాడని, పవన్ కళ్యాణ్ తిరిగి ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టిన రోజున దీన్ని విడుదల చేయబోతున్నట్టు చెప్పాడు.
The boys before they destroy the world. #OG 💥💣 #TheyCallHimOG pic.twitter.com/YbTLhhX76G
— DVV Entertainment (@DVVMovies) September 22, 2024
గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పాటను రికార్డ్ చేశారు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉండగా, అవన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తానికి తమన్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఖుషీ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘ఓజాస్ గంభీర’అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
ప్రియాంక మోహన్ హీరోయిన్. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’చిత్రాన్ని పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.