మంగపతి లాంటి పాత్ర నా పాతికేళ్ల కల..

మంగపతి లాంటి పాత్ర నా పాతికేళ్ల కల..

కోర్ట్‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో తన పాత్రకొస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోంది అని  నటుడు శివాజీ అన్నాడు. హీరో నాని సమర్పణలో  ప్రియదర్శి లీడ్‌‌‌‌‌‌‌‌గా  రామ్ జగదీష్ రూపొందించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ దక్కించుకుంది. ఇందులో శివాజీ పోషించిన పాత్రకు చక్కని ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా శివాజీ ఇలా ముచ్చటించాడు.

‘‘కొన్నాళ్ల గ్యాప్ తర్వాత చేసిన ‘నైంటీస్’ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవడంతో చాలా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఎనభై కథలు విన్నాను. రెగ్యులర్  ఫాదర్ రోల్స్ కావడంతో చాలా వరకు రిజెక్ట్ చేశా. కానీ ‘కోర్ట్‌‌‌‌‌‌‌‌’లో చేసిన మంగపతి క్యారెక్టర్ మాత్రం నా 25 ఏళ్ల కల. నానిగారి ద్వారా ఈ చాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. నా పాత్రకొచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి దర్శకుడు నా క్యారెక్టర్ తీసుకున్నాడని భావిస్తున్నా. నా పాత్రకు, నటనకు వచ్చిన క్రెడిట్ అంతా దర్శకుడిదే.  

ఈ పాత్రలో సహజమైన ఎమోషన్  ఉంది. ప్రతి కుటుంబంలో అలాంటి వ్యక్తి  ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలానే బిహేవ్ చేస్తాడు.  ఎస్వీ రంగారావు గారు, గుమ్మడి గారు, జగ్గయ్య గారు, రాజనాల గార్ల తరహాలో మరపురాని పాత్రలు చేయాలనుంది.  ప్రస్తుతం లయ, నేను కలిసి నా సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ సినిమా చేస్తున్నాం.  అలాగే ‘దండోరా’ అనే మూవీతో పాటు  ‘నైంటీస్‌‌‌‌‌‌‌‌’కి సీక్వెల్ ఉంటుంది. మంగపతి తరహాలోనే  మెడికల్ షాప్ మూర్తి అనే ఓ క్యారెక్టర్ చేయబోతున్నా. త్వరలోనే ఆ మూవీ అనౌన్స్ చేస్తారు