
తమిళ నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ఆయన దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కివ బిజీ అవుతున్నాడు. ఆయన విలక్షణ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మధ్య ఆయన చేసిన పాత్రలకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో.. వారుగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఎస్జే సూర్య.
ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రెస్టీజియస్ సినిమాల్లో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న రెండు సినిమాకు ఇండియన్ 2, గేమ్ఛేంజర్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో ఎస్జే సూర్య మెయిన్ విల్లన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 మూవీ జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్జే సూర్య ఇండియన్ 2 గురించి, గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇండియా 2 చాలా పెద్ద సినిమా సినిమా. ఈ సినిమాలో అవకాశం రావడానికి రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీనే కారణం. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు నాకు మధ్య వచ్చే సీన్స్ డైరెక్టర్ శంకర్ కు చాలా బాగా నచ్చాయి. ఆ సీన్స్ రషెష్ చూసిన ఆయన వెంటనే ఇండియన్ 2 సినిమాలో మెయిన్ విలన్ గా తీసుకున్నారు. అలా ఇండియన్ 2 లాంటి సినిమాలో అవకాశం రావడానికి రామ్ చరణ్ సినిమా హెల్ప్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు ఎస్జే సూర్య. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.