
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘బాఘీ’ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు భాగాలు రాగా, ఇప్పుడు ‘బాఘీ 4’ రెడీ అవుతోంది. గోపీచంద్‌తో ‘భీమా’ తీసిన కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియడ్వాలా నిర్మిస్తున్నారు. సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల పంజాబీ నటి సోనమ్ బజ్వా ఇందులో నటించబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్.. గురువారం మరో హీరోయిన్‌గా హర్నాజ్ కౌర్ సంధు పేరును రివీల్ చేశారు. 2021 మిస్ యూనివర్స్ అయిన ఆమె ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఆమె రెండు పంజాబీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
2021 డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ టైటిల్‌ను అందుకున్న హర్నాజ్.. సరిగ్గా రెండేళ్ల తర్వాత అదే తేదీకి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ‘మిస్ యూనివర్స్ నుంచి బాఘీ యూనివర్స్‌కు’ అంటూ హర్నాజ్‌కు సోషల్ మీడియా ద్వారా వెల్‌కమ్ చెప్పాడు హీరో టైగర్ ష్రాఫ్. నవంబర్‌లో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.