పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

కరోనా వల్ల ఇబ్బందులు పడిన అనేకమందికి నేనున్నానంటూ భరోసా కల్పించాడు సోనూ సూద్. ఏ ప్రాంతం వారు, ఏ భాషవారు అనే తేడాలేవీ లేకుండా కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు.. వెంటనే వారికి హెల్ప్ చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా సోనూ పేరు మార్మోగుతోంది. సామాన్య జనంతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం సోనూసూద్‌‌ని ఎంతో మెచ్చుకుంటున్నారు. రీల్ విలన్, రియల్ హీరో అయ్యాడంటూ పొగుడుతున్నారు. ఇవన్నీ చూసి కొందరు రాజకీయ ప్రముఖులు సోనూని పాలిటిక్స్‌‌లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. అయితే అది కుదరదంటున్నాడు సోనూ. అలాగని రాజకీయాల్లోకి అడుగు పెట్టను అనడం లేదు. ఎంట్రీ ఇవ్వడానికి ఇది కరెక్ట్ టైమ్‌‌ కాదంటున్నాడు. ‘నా పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పాను. అయినా పదే పదే అడుగుతున్నారు. ఇప్పట్లో నాకు అలాంటి ఆలోచన లేదు. సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు కదా. నటుడిగా నేను చేయాల్సింది చాలా ఉంది. చాలా సినిమాల్లో నటించాలి. పాలిటిక్స్‌‌ గురించి ఇప్పడప్పుడే ఆలోచించేది లేదు. ప్రస్తుతం నేను ఎవరితో సంబంధం లేకుండా నాకు తోచినమేర సాయం చేస్తున్నాను. రాజకీయాల్లోకి వస్తే ఆ పరిస్థితి ఉంటుందో లేదో చెప్పలేను. వస్తే మాత్రం ఇంతకంటే మెరుగ్గా సేవ చేయడానికి కృషి చేస్తాను’ అంటూ సోనూ  క్లారిటీ ఇచ్చాడు సోనూ సూద్.

For More News..

కరోనా మరణాలపై సర్కారు లెక్కలు నమ్మబుద్ధి కావట్లే