కరీంనగర్ చిన్నారికి సోనూ సూద్ సాయం

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి ఉదారత చాటుకున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఏడు నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలో ఆయన సహాయం చేశారు. కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఆస్టర్ మెడ్ సిటీ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. వైద్య రంగంలో భారతదేశం భారీ ప్రగతిని సాధించింది.. కానీ.. అరుదైన వ్యాధుల కారణంగా ఖర్చును భరించలేని కొన్ని కుటుంబాలు సమస్యలను ఎదుర్కొంటున్నారని సోనూ వ్యాఖ్యానించారు. 


వివరాల్లోకి వెళితే....
కరీంనగర్ లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. నాలుగు నెలల వయస్సున్న సఫా అలీకి Biliary Atresia అనే అరుదైన వ్యాధి సోకింది. దీని కారణంగా కాలేయం దెబ్బతిన్నది. కరీంనగర్ లో శస్త్ర చికిత్స విజయవంతం కాలేదు. తీవ్రమైన కామెర్లు, సిర్రోసిస్ వ్యాధితో చిన్నారి బాధ పడింది. దీంతో కొచ్చిలోని ఆస్టర్ మెడిసిటీ (Aster Medcity) ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అక్కడ చిన్నారిని పరీక్షించారు. ఈ విషయం సోనూ సూద్ కు తెలిసింది. దీంతో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు సహాయం చేశారు. ఏడు నెలల వయస్సులో వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ స్పందించారు. వైద్య రంగంలో భారతదేశం భారీ ప్రగతిని సాధించిందని, కానీ అరుదైన రోగాలకు భారీ ఖర్చు తట్టుకోలేక కొంతమంది కుటుంబీకులు కష్టాలు పడుతున్నారని వెల్లడించారు. సఫాన్ అలీ లాంటి మరింత మంది రోగులకు జీవితాన్ని అందించాలని వైద్యులను కోరారు.