Sonu Sood: కుమారి ఆంటీని కలిసిన నటుడు సోనూ సూద్.. ఫొటోస్ వైరల్

Sonu Sood: కుమారి ఆంటీని కలిసిన నటుడు సోనూ సూద్.. ఫొటోస్ వైరల్

బాలీవుడ్ నటుడు సోను సూద్ కుమార్ ఆంటీని కలిశారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెను కలిశారు. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన అయన కుమారి ఆంటీ బాగోగులు, వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఆమె ముచ్చటించిన ఆయన.. నేను వెజ్ ఐటమ్స్ తింటానని.. నాకు డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా అని అడగగా. దానికి సమాధానంగా.. మీకు ఫ్రీగా ఇస్తాను, ఎంతో మందిని కష్ట కాలంలో ఆదుకున్నారు. ఇంకా చాలా మందికి సహాయం చేస్తూనే ఉన్నారు. అలాంటి మీకు మేము ఏమిచ్చినా తక్కువే.. అన్నారు కుమారి ఆంటీ. 

ఈ సంధర్బంగా నటుడు సోను సూద్ మాట్లాడుతూ.. కుమారి ఆంటీ స్త్రీ శక్తికి నిదర్శనం అని, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఈవిడే నిదర్శనం అని, స్వయంకృషితో ఎదిగే కుమారి ఆంటీ లాంటివారిని సపోర్ట్‌ చేద్దామని.. అన్నారు సోను సూధ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.