సోనూ సూద్ ని అరెస్ట్ చెయ్యాలంటూ కోర్టు ఆర్డర్స్.. ఏం జరిగిందంటే..?

సోనూ సూద్ ని అరెస్ట్ చెయ్యాలంటూ కోర్టు ఆర్డర్స్.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో, విలన్ సోనూ సూద్ కి పంజాబ్‌లోని లూథియానా కోర్టు శాఖ ఇచ్చింది. ఇందులోభాగంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరు కాకుండా దాటవేస్తున్న సోనూ సూద్ ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ ఆర్డర్స్ పాస్ చేశారు. దీంతో సోనూ సూద్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెగిటివ్ ఫ్యాన్స్ సోనూ సూద్ గురించి నిజానిజాలు తెలుసుకోకుండా ఉన్నవేలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. 

దీంతో సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ఫేక్ న్యూస్ ప్రచారం గురించి స్పందించాడు. ఇందులో భాగంగా పంజాబ్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ విషయంపై ఇప్పటికే తన లాయర్లు వివరణ ఇచ్చారని ఈ విషయంపై ఫిబ్రవరి 10న  విచారణ జరగనుందని తెలిపాడు. ఈ విచారణలో మాకు ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదని కూడా కోర్టుకి వివరణ ఇస్తామని క్లారిటీ ఇచ్చాడు. 

అయితే తనకి సంబంధం లేనటువంతో ఓ థర్డ్ పార్టీ కంపెనీ విషయంలో వాంగ్మూలం ఇచ్చే విషయంలో మాత్రమే ఆర్డర్స్ జారీ చేసిందని అంతేకానీ నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయద్దని సూచించాడు. అలాగే పాపులర్ కావడం కోసం తన పేరుని ఉపయోగిస్తూ అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

ఈ విషయం ఇలా ఉండగా సోనూ సూద్ ఇటీవల "ఫతే" అనే సినిమాలో హీరోగా నటించాడు. అలాగే దర్శకత్వం కొద వహించాడు.  షార్ట్ లోన్స్ యాప్స్ ద్వారా వేధింపులకు పాల్పడుతూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన వారిని పట్టుకునే నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. అలాగే రూ.20 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శివజ్యోతి రాజ్ పుత్, నసీరుద్దీన్, విజయ్ రాజ్,  ప్రకాష్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.