మలయాళ సినిమాల్లో యంగ్ హీరోగా ఫేమస్ అయిన యాక్టర్ సుదేవ్ నాయర్ (Sudev Nair). ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకుని మాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు.
తాజాగా సుదేవ్ నాయర్ సైలెంట్గా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆయన తన ప్రేయసి, మోడల్ అమర్‌దీప్ కౌర్ (Amardeep Kaur) ను ఇవాళ (ఫిబ్రవరి 19న) వివాహం చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్‌లో జరిగిన వీరి వివాహానికి స్నేహితులు, కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుదేవ్ గోల్డెన్ బార్డర్‌తో సాంప్రదాయక తెలుపు రంగు పంచలో కనిపించగా, అమర్‌దీప్ కౌర్ తన తెల్లని గోల్డెన్ బార్డర్ పెళ్లి చీరలో అందంగా కనిపించింది. అయితే సుదీప్, అమర్‌దీప్‌లు చాలా కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.
సుదేవ్ నాయర్ సినిమాల విషయానికి వస్తే..2014 లో సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం గులాబ్ గ్యాంగ్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చాడు. సుదేవ్ దాదాపు 30 సినిమాలు, హిందీ, ఇంగ్లిష్, మలయాళంలో కలిపి 12 వెబ్ సీరిస్ ల్లో నటించాడు. తెలుగులో రవితేజ టైగర్ నాగేశ్వర రావు, నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీస్లో విలన్గా నటించి మెప్పించాడు.