ప్రముఖ సినీ నటుడు సుమన్(Suman) ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల ఓక ఛానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజకీయ నాయకులు హీరోల పారితోషకాలపై మాట్లాడడం ఏంటి? పారితోషకాలకు, రాజకీయాలకు సంబంధం ఏంటి? ఆ విషయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు. సినీ పరిశ్రమ వాళ్ళు పకోడీగాళ్లు కాదు, వాళ్ళని విమర్శించే వాళ్లే బజ్జిగాళ్లు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇటీవల రజనీకాంత్ ను విమర్శించడం నాకు బాధ కలిగించింది. రాజకీయాలతో సంబంధం లేని ఆయనపై కూడా బురద చల్లుతున్నారు.
ALSO READ :యాదగిరిగుట్టలో నేటి(ఆగస్టు 26) నుంచి పవిత్రోత్సవాలు
నాకు తెలిసిన చాలా మంది రాజకీయ నాయకులకు రెండు మూడు కుటుంబాలున్నాయి. అయితే వాళ్ళు రాజకీయాలకు పనికిరారా. అలా ఏదైనా చట్టం ఉందా? లేదు కదా. ప్రతీ మనిషి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి రాజకీయంగా ఆయనపై బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యలు ఏమైనా న్యాయం చేయాలని మీ దగ్గరకు వచ్చారా? పవన్ తో పాటు చాలామంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళున్నారు. దమ్ముంటే వాళ్ళపై కూడా కామెంట్ చేయండి అంటూ తీవ్రంగా మండిపడ్డారు సుమన్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.