Sunil : పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న కమెడియన్ సునీల్

Sunil : పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న కమెడియన్ సునీల్

ఓవైపు కమెడియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా,  మరోవైపు క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు సునీల్. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. జైలర్, మార్క్ ఆంటోని, జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి తమిళ చిత్రాలతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న సునీల్.. ఇప్పుడు మరో కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్నాడు. విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో ‘జననాయగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రం రూపొందుతోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ నటిస్తున్న పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్ మూవీ ఇది. 

పైగా తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి చిత్రం. ఇందులో విజయ్ పొలిటీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా.. తనకు ప్రత్యర్థి రాజకీయ నాయకుడి పాత్రలో సునీల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. వైట్ అండ్ వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పొలిటీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాడీ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసక్తికరంగా ఉందంటున్నారు. ఈ సినిమా తర్వాత సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమిళనాట మరింత బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.