
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన యాక్షన్ లవ్ స్టోరీ ‘రెట్రో’. పూజాహెగ్డే హీరోయిన్. సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. సితార సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘గజినీ చిత్రం చూసి సూర్య అన్నకు ఫ్యాన్ అయ్యా. అది మొదలు ఆయన సినిమాలన్నీ చూశా. ఇప్పుడిలా ఆయన్ను కలుసుకోవడం నాకు స్పెషల్ మూమెంట్. నేనొవరో తెలియకపోయినా నా కెరీర్ కొత్తలో సూర్య అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.
సూర్య మాట్లాడుతూ ‘కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలు సెపరేట్ జానర్‌లో ఉంటాయి. విజువల్స్, మేకింగ్ పూర్తి డిఫరెంట్‌గా ఉంటూ యూనిక్ వేలో ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇదికూడా అలాంటి ఓ యాక్షన్, ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ. తనతో పనిచేయడం అద్భుతంగా అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ గారికి, తెలుగులో లిరిక్స్ రాసిన కాసర్ల శ్యామ్ గారికి థ్యాంక్స్. నాజర్, ప్రకాష్ రాజ్, జయరామ్, జోజు జార్జ్ లాంటి అద్భుతమైన నటులతో కలిసి వర్క్ చేశాను. పూజాహెగ్డే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టింది. ఇక ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగవంశీది లక్కీ హ్యాండ్. నా నెక్స్ట్ మూవీ సితార సంస్థలో వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఉండబోతోంది. మే నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మే 1న నాకు స్నేహితుడైన నాని సినిమా ‘హిట్ 3’ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో తను హ్యాట్రిక్ కొట్టాలని, మా రెండు చిత్రాల విజయాలను కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నా’ అని చెప్పాడు. తన స్పీచ్‌కు ముందు పహల్గాం టెర్రరిస్ట్ అటాక్‌లో మరణించిన వారి కుటుంబాలకు సూర్య సానుభూతి తెలియజేశాడు. నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి, నటుడు కరుణాకరన్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, నిర్మాత కార్తికేయన్ సంతానం పాల్గొన్నారు.
విద్య, క్రమశిక్షణ లేకనే టెర్రరిస్ట్ దాడులు – విజయ్ దేవరకొండ
పహల్గాం అటాక్ గురించి విజయ్ మాట్లాడుతూ ‘ప్రతి మనిషికి చదువు, క్రమశిక్షణ చాలా అవసరం. సరైన చదువు, క్రమశిక్షణ లేకపోవడం వల్లే పహల్గాం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కశ్మీర్ ఇండియాదే. కశ్మీర్ వాళ్లు మనోళ్లే. పాకిస్తాన్‌లో కరెంట్ లేదు, నీళ్లు లేవు.. కానీ ఇక్కడ ఏదో చేయాలని చూస్తారు. ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌పై ఇండియా అటాక్ చేయాల్సిన పనిలేదు. వాళ్లకే విరక్తి వచ్చి పాక్ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు’ అని చెప్పాడు.