Varalaxmi Sarathkumar: చిన్నప్పుడే.. ఐదారుగురు లైంగికంగా వేధించారు : బాధను చెప్పుకుంటూ ఏడ్చేసిన వరలక్ష్మి

Varalaxmi Sarathkumar: చిన్నప్పుడే.. ఐదారుగురు లైంగికంగా వేధించారు : బాధను చెప్పుకుంటూ ఏడ్చేసిన వరలక్ష్మి

తమిళ-తెలుగు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నటనలో తనది ప్రత్యేక స్థానం. ప్రముఖ నటుడు శరత్ కుమార్ మరియు ఛాయ దంపతుల కుమార్తె వరలక్ష్మి. ప్రస్తుతం తాను నటిగా వరుస సినిమాలతో, జడ్జ్గా పలు టీవీ షోలతో బిజీగా ఉంది.

లేటెస్ట్గా జీ తమిళ్‌లో ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకి జడ్జ్గా వ్యవహరించింది. ఆ షోలో వరలక్ష్మి శరత్‌కుమార్.. తాను చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైనట్లు బాధపడుతూ చెప్పింది. ఆమె తన  బాల్యంలో జరిగిన కథను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. వివరాల్లోకి వెళితే.. 

ఈ రియాలిటీ షోలో.. కెమీ అనే డ్యాన్స్ కంటెస్ట్ తన కుటుంబ సభ్యులచే నిరాశకు గురైనట్లు చెబుతూ ఎమోషనల్ అయింది. అలా ఇతరులచే లైంగిక వేధింపులకు గురైనట్లు తన కథను షో ద్వారా పంచుకుంది. కెమీ కథ విన్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. అలా బాధపడుతూ తన లైఫ్ లో ఎదురైన సంఘటనలు పంచుకుంది. 

Also Read:-వివాదంలో డొక్కా సీతమ్మ బయోపిక్.. అసలేమైందంటే?

వరలక్ష్మి శరత్‌కుమార్.. "నేను మీలాగే  లైంగిక వేధింపులకు గురయ్యాను. నా తల్లిదండ్రులు (నటుడు శరత్ కుమార్ మరియు ఛాయ) అప్పట్లో తమ సినిమా పనుల్లో బిజీగా ఉండేవారు. కాబట్టి వారు నన్ను ఇతరుల సంరక్షణలో వదిలివేసేవారు. అలా చిన్నప్పుడు ఐదు నుండి ఆరుగురు వ్యక్తులు నన్ను  లైంగికంగా వేధించారు. మీ కథ నా కథ ఒకటే. నాకు పిల్లలు లేరు. కానీ, నేను తల్లిదండ్రులకు ఒక్కటే చెప్పదలచుకున్నాను.. తమ పిల్లలకు 'మంచి స్పర్శ' మరియు 'చెడు స్పర్శ' గురించి నేర్పించాలని అభ్యర్థిస్తున్నా" అని వరలక్ష్మి కోరింది. 

ఇక ఆ వెంటనే..'తనకు కెమెరా ముందు ఏడవడం అలవాటు లేదని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని' వరలక్ష్మి చెప్పుకొచ్చింది. తన పక్కనే ఉన్న కో జడ్జ్ నటి స్నేహ "తాను క్షమాపణ చెప్పకూడదని, తన కథను పంచుకోవడానికి ధైర్యం కావాలని" ప్రశంసించింది.