
30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు(Chaitanya Rao), రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా కీడా కోలా(Keeda-Cola). ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంతో పాటు..కీలకమైన పాత్రను పోషించాడు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ తో ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఫుల్ మీల్స్ ఎంటర్‌టైనర్‌లా ఉంది. క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం(Bramhanandam) ముఖ్యమైన పాత్రను పోషించారు.
తరుణ్ భాస్కర్ కీడా కోలా మూవీ నవంబర్ 3న రిలీజ్ కానుంది. నిన్న ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గెస్ట్గా వచ్చాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక్కరు సక్సెస్ అయితే..ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. విజయ్ అనే ఈ సామాన్యుడిని..హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది డైరెక్టర్ తరుణ్ భాస్కర్.
మేం ఖాళీగా డబ్బులు లేకుండా ఎన్నోసార్లు హైదరాబాద్ వీధుల్లో..ప్రపంచం మాదే అనేలా కలిసి తిరిగాం..ఎంతో కష్టపడ్డాం..పెళ్లి చూపులు సినిమా తీసాం..నేషనల్ అవార్డు సాధించాం. మన మొత్తం జీవితాన్ని..'మనం పెరిగిన వాతావరణం, మనం తీసుకునే గొప్ప డెసిషన్స్, మనం కలిసే వ్యక్తులు..'ఈ మూడే డిసైడ్ చేస్తాయని తన మిడిల్ క్లాస్ లైఫ్ని గుర్తుచేసుకున్నాడు.అలాగే..తరుణ్ భాస్కర్ వల్లే తన ఫ్యామిలీ ఇవాళ ఇంతటి స్థాయిలో ఉందని అన్నారు.
Also Read :- మరో బేబీని దించుతున్న సాయి రాజేష్
ప్రస్తుతం నేను..నా సినిమా జీవితంలోఇంత సక్సెస్ ఫుల్ స్థాయిలో ఉన్నానంటే..అందుకే ముగ్గురే కారణం..డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ వంగా. సినిమాలకు రాకముందు వరకు..వీళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను ఎవరో కూడా వీళ్ళకి తెలీదు. మేమందరం ఒక్కోచోట చదివినా, పెరిగినా సినిమా అనే బిగ్ ప్లాట్ ఫామ్ మా అందరినీ కలిపిందని..విజయ్ తన ఎమోషనల్ జర్నీని షేర్ చేసుకున్నారు.
అలాగే కీడాకోలా సినిమా గురించి మాట్లాడుతూ..ఎంతో క్యూరియాసిటీతో.. ఇంటెన్స్ గా ఉన్న టీజర్చి, ట్రైలర్ తోనే చించేశారు. ఎంటైర్ చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపాడు విజయ్ దేవరకొండ.